#varam #manukotaptalu #Jansi
Lyrics & Music: Manukotaprasad
Singer:Varam
Programming: Kalyan
Mixing: Balu
Cameramen: Ravi Bollam, Arif
Editing: Ramesh Gajula
Choreography: Jhansi Liri, Raghu
Asst Director: Ravi Teja
Director: Ravindra Sidharth Munigala
Producer: Likitha Vemula
Watch #Jatara #BathukammaSong
జాతర జం జజ్జనకారి మోతలే… బతుకమ్మ పాట
#Manukotapatalu
#ManukotaPatalu
జాతర జం జజ్జనకరే మోతలే….
పువ్వులను పూజించే యాతరే…
సపట్లతో సంతోషం నిండుడే..
ఇగ గౌవరమ్మను గంగమ్మను కలుపుడే..
అవ్వను సుడు పెద్ద ముత్తైదువురా…
అయ్యను సుడు పని పాటల జాడ
అక్క చెల్లి పుట్టినిల్లు చేరుకోగా వచ్చేర…
చరణం:-
అడవికి గంధమ్ముగా పల్లెకు బంధమ్ముగా
తంగేడు తలఏత్తి నిలిచే కంచెల్లారా…
ముడితే మురికంటరు పడితే పాపం అనే..
జిల్లేడు జాతర జుడు ఈ నాటికి
పోసింద బంగారపు ధార చూడరా బంతిపూల మేడ
కాసింద ఎండి సెలకళ్ళ తెంపుకరా గునుగు గంపల్ల..
ఏనుగుల మీద ఇంద్ర ధనసే విరిసే..ఎన్నో కొన్ని రంగులు ఎరుకారావే
కలువలను తాకి సుడు సిగ్గు పడి హత్తుకోవా
చరణం2
పసుపుతో గౌరమ్మరా..గుమ్మడి బొడ్డెమ్మ రా
ముద్దుల బతుకమ్మకు తొడ..
చీకటి కాలానికి ఇంటికి చేరిందిరా…
అష్టమికి అరుగు దాటే ..సద్దుల బతుకమ్మరా
గంగమ్మ ఎదురు సుపులేవరికే…గౌరమ్మను కలుసుకునేటందుకే ..
ఆడబిడ్డలంధంగా..కదిలిరే…పాటలు పాడి ఆడి మురిసిరే…
వాయినం ఇచ్చి ఆలింగనం ఇచ్చే..అలలను తాకే బతుకమ్మ సాగే
సంతోషం కడుపునిండి..ఊరే మురిసిందిలే..